Tirumala | నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద వేడుకగా ఛత్రస్థాపనోత్సవం
Tirumala | తిరుమల (Tirumala) నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ఆదివారం ఛత్రస్థాపనోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.
తిరుమల : తిరుమల (Tirumala) నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ఆదివారం ఛత్రస్థాపనోత్సవాన్ని (Chhatrastaphananotsava ) వేడుకగా నిర్వహించారు. శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు. శ్రీవారి ఆలయం నుంచి పూజా సామగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల గుండా అర్చక బృందం మేదరమిట్టకు చేరుకున్నారు. అక్కడి నుంచి నారాయణగిరికి చేరుకుని శ్రీవారి పాదాలకు తిరుమంజనం(Tirumanjanam) చేపట్టారు. పాలు, పెరుగు, తేనె, చందనంతో అభిషేకం, నైవేద్యం సమర్పించారు.
వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామి మొదటగా కాలు మోపినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందని అర్చకులు పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిండం ఆనవాయితీగా వస్తుందన్నారు.
నారాయణగిరి (Narayanagiri) శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడం ఈ కాలంలో మరింత ఎక్కువగా గాలులు వీయడం, ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టించారు. కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరు ఎటి.గోవిందరాజ దీక్షితులు, అర్చకులు ఎ.గోవిందాచార్యులు, ఏఎస్.కృష్ణచంద్ర దీక్షితులు, పార్‌పత్తేదార్ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

