TTD | టీటీడీ సంచలన నిర్ణయం.. నడకమార్గాల్లో ఈ పదార్థాల విక్రయాలు బంద్
TTD | టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల క్రూరమృగాల (Wild animals Attacks) దాడుల నేపధ్యంలో పలు పదార్థాల విక్రయాలు జరుపరాదని సూచించింది .
తిరుమల : టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల క్రూరమృగాల (Wild animals Attacks) దాడుల నేపధ్యంలో అలాంటి పదార్థాల విక్రయాలు జరుపరాదని సూచించింది . తిరుమల (Tirumala) నడక మార్గాల్లో క్రూరమృగాల కదలికల నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా దుకాణదారులకు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి పలు సూచనలు చేశారు.
తిరుపతిలోని పరిపాలనా భవనంలో పోలీసు, అటవీ, ఎస్టేట్, ఆరోగ్య శాఖ అధికారులతోపాటు దుకాణాల నిర్వాహకులతో ఈవో శుక్రవారం సమావేశం నిర్వహించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈవో (TTD EO ) మాట్లాడుతూ నడకమార్గాల్లో విక్రయాలకు సంబంధించి అటవీ, ఎస్టేట్, ఆరోగ్యశాఖల అధికారులతో పాటు పలువురు భక్తులు పలు సూచనలు చేసినట్టు చెప్పారు.
అలిపిరి నడక మార్గంలో వందకు పైగా తినుబండారాలు విక్రయించే దుకాణాలు ఉన్నాయని వెల్లడించారు. వీటిలో ఇకపై పండ్లు, కూరగాయలు విక్రయించరాదని సూచించారు. భక్తులు వీటిని కొనుగోలు చేసి సాధు జంతువులకు తినిపించడం వల్ల వాటి రాక పెరుగుతోందని, ఈ జంతువుల కోసం క్రూరమృగాలు అటువైపు వచ్చి భక్తులపై దాడి చేస్తున్నాయని వివరించారు.
అన్ని దుకాణాల వద్ద తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా చెత్తకుండీల్లో వేయాలని తెలిపారు. నడక మార్గంలో రోజుకు రెండు నుంచి మూడు టన్నుల చెత్త పోగవుతోందని ఆయన పేర్కొన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా నడకదారి పొడవునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. తినుబండారాల దుకాణదారులు ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. క్రూరమృగాల జాడ కనిపిస్తే వెంటనే తెలిపేందుకు వీలుగా అటవీ, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాల అధికారుల ఫోన్ నంబర్లు ప్రదర్శిస్తామని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

