Pawan Kalyan | ఛాన్స్ దొరికితే చాలు.. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేసే ఆర్జీవీ మరోసారి చెలరేగిపోయాడు. సూపర్‌స్టార్ అయ్యి ఉండి కూడా బర్రెలెక్క మారిపోయిండు అంటూ సెటైర్లు వేశాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన వ్యూహం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. జనసేనానిపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
పవన్ కళ్యాణ్ ముఖానికి రంగులు వేసుకుని సూపర్‌స్టార్‌గా ఎదిగాడని.. అతనికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తొలుత జనసేనాని రామ్‌గోపాల్‌వర్మ మెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఇంప్రెస్ కూడా అయ్యానన్నాడు. రాజకీయ నాయకుడిగా మారినప్పుడు ఇది చేస్తా.. అది చేస్తా అని సినిమా డైలాగులు చెబితే బాగోదని హితవు పలికాడు. లేటెస్టుగా తెలంగాణలో ఊరు, పేరు తెలియని బర్రెలు కాసే అమ్మాయి బర్రెలక్కగా పాపులర్ అయ్యింది. కానీ సూపర్ స్టార్ అయ్యి ఉండి పవన్ కళ్యాణ్ బర్రెలెక్క మారిపోయాడని ఎద్దేవా చేశారు. బర్రెలక్కకి.. బర్రెలెక్కకి తేడా కూడా వివరించాడు. బర్రెలక్క అంటే బర్రెలకు అక్క.. ఒక కాపరి.. కానీ ఈయన ఒక బర్రెలా మారిపోయాడు అని అన్నాడు. చంద్రబాబు, లోకేశ్ ఏం చెబితే అది చేస్తున్నడు అని ఎద్దేవా చేశారు. జనసేన కార్యకర్తలకంటే పవన్ కళ్యాణ్ తనకు ఎక్కువ ఇష్టమని.. కానీ ఇప్పుడు అది పోయిందని అన్నాడు.