cyclone gulab | ఏపీలో గులాబ్ బీభత్సం.. భారీ వర్షాలు, ఈదురుగాలులు
cyclone gulab |

అమరావతి: గులాబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను వల్ల రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. కాగా, గులాబ్ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారింది. గడిచిన ఆరు గంటల్లో వాయుగుండంగా బలహీనపడింది.

గులాబ్ ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూసపాటిరేగ, గజపతినగరం, నెల్లిమర్ల మండలాల్లో 10 సెం.మీ. పైగా వర్షపాతం నమోదయ్యింది. భోగాపురం మండలంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి.
విశాఖపట్నంలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. భారీవర్షానికి లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు వర్షాలు కురుస్తున్నాయి.
ఇక కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి విజయవాడలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

