సృజన ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం.. తేల్చిన పోలీసులు
విశాఖపట్టణం : మధురవాడకు చెందిన సృజన ఆత్మహత్య కేసులో చిక్కుముడి వీడింది. పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలోనే సృజన ప్రాణాలు పోగొట్టుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. కాల్ డయల్ రికార్డర్‌తో నిజాలు వెలుగు చూశాయి. పెళ్లికి ముందు ప్రియుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పరవాడకు చెందిన తోకాడ మోహన్ అనే యువకుడిని గత ఏడేండ్ల నుంచి సృజన ప్రేమిస్తోంది. అయితే పెళ్లి చేసుకోవాలని సృజన తన ప్రియుడిని కోరగా, జీవితంలో సెటిలైన తర్వాత చేసుకుంటానని నమ్మబలికాడు. ఇంకో రెండేండ్లు ఆగాలని చెప్పారు. పెళ్లికి రెండు రోజుల ముందు సృజన తన ప్రియుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తీసుకెళ్లాలని సృజన మోహన్‌ను కోరింది. రెండేండ్లు సమయం కావాలని సృజనకు మోహన్ చెప్పాడు. ఎలాగైనా పెళ్లిని ఆపేందుకు ట్రై చేస్తానని చెప్పింది. అనంతరం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ చాటింగ్‌లతో పాటు కాల్ డేటాను సృజన డిలీట్ చేసింది. పెళ్లిని ఆపేందుకు సిద్ధపడిన సృజన.. ఈ నెల 11వ తేదీన విష పదార్థం తీసుకున్నది. అనంతరం ముహూర్తం సమయానికి పెళ్లి పీటల పైనే ఆమె కుప్పకూలిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 12న సృజన మృతి చెందింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

