Tirumala News : శ్రీవారి ఆలయంలో పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు
Tirumala News | తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు శాస్త్రోక్తంగా జరిగిన పవిత్రోత్సవాలు సాయంత్రం పూర్ణాహుతితో ముగిశాయి.

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు శాస్త్రోక్తంగా జరిగిన పవిత్రోత్సవాలు సాయంత్రం పూర్ణాహుతితో ముగిశాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చేపట్టారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు.
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు కటాక్షించారు. 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. ఆ తరువాత శ్రీమలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ రమేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

