పర్యాటక బోట్లలో భద్రతాపరమైన లోపాలు నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర నిలిపివేత
నేటి నుంచి పాపికొండలు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
అమరావతి : నేటి నుంచి పాపికొండలు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గోదావరిలో పర్యాటక బోట్ల నిర్వహణపై భద్రతపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పర్యాటక బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కాగా, జూన్ 12న, 89 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ పర్యాటక పడవలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది దేవిపట్నం సమీపంలో గోదావరి నది మధ్యలో నిలిచిపోయింది.
ప్రయాణికులను సురక్షితంగా తరలించినప్పటికీ, అధికారులు పడవను తనిఖీ చేయడానికి వెంటనే కార్యకలాపాలను నిలిపివేశారు. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీల పక్రియను ముమ్మరం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. కునవరం నుండి (తెలంగాణలోని భద్రాచలం మీదుగా) పాపికొండ కొండ శ్రేణిలోకి ప్రవేశించే పడవ సేవలకు ఈ నిలుపుదల వల్ల ఎలాంటి అంతరాయం ఉండదని అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

