Srisailam | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాలినడకన వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు .. అటవీ మార్గంలో 12 చోట్ల మౌలిక వసతులు..!
Srisailam | మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్ర సందర్శనకు అటవీ మార్గంలో కాలి నడకన వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని నంద్యాల జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి చెప్పారు.
Srisailam | శ్రీశైలం/నంద్యాల, ఫిబ్రవరి 11: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్ర సందర్శనకు అటవీ మార్గంలో కాలి నడకన వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని నంద్యాల జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి చెప్పారు. మంగళవారం శ్రీశైలంలోని కైలాస ద్వారం నుండి.. అటవీ మార్గంలోని తుమ్మల బైలు, పెచ్చేరువు, నాగులూటి గూడెం, వెంకటాపురం వరకు ప్రయాణిస్తూ ఏఏ ప్రదేశాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సీ విష్ణుచరణ్, శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు, డీఎఫ్ఓ అబ్దుల్ రవూఫ్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

తుమ్మలబైలు నుండి పెచ్చేరువుకు వెళ్ళే అటవీ మార్గంలో పెద్ద పులి పాద ముద్రలను కలెక్టర్ జీ రాజకుమారి పరిశీలించారు. సంబంధిత వివరాలను అటవీ సిబ్బంది నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి మాట్లాడుతూ వెంకటాపురం నుండి కైలాస ద్వారం వరకు 46 కిమీ మార్గంలో భక్తులు కాలినడకన ప్రయాణించాలని ఈ మేరకు గుర్తించిన 12 ప్రదేశాల్లో భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, షేడ్, భోజన వసతి, వైద్య సదుపాయం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రధానంగా భక్తులు కాలినడకన ప్రయాణించే అటవీ మార్గం.. కోర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ క్రిందకు వస్తున్నందున పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత కూడా అందరిపై ఉందన్నారు.

కాలినడకన వచ్చే భక్తులకు ప్రధానంగా నీటి అవసరం ఉంటుందని జీ రాజకుమారి తెలిపారు. రెండు లీటర్లు, ఐదు లీటర్ల క్యాన్లలో నీటిని తీసుకెళ్లేందుకు అటవీ సిబ్బంది అనుమతి ఇస్తున్నారన్నారు. అలాగే, భక్తులు తాము తీసుకెళ్లిన పదార్థాలను ఎక్కడికక్కడ పారేయకుండా ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలోనే వేసేలా భక్తులకు సూచనలు ఇస్తున్నామన్నారు. అటవీ మార్గంలో అస్వస్థతకు గురైన భక్తులకు వైద్యం అందించేందుకు అవసరమైన అంబులెన్సులు, ఇతర వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచుకునేలా వైద్య సిబ్బందికి ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.

శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే భక్తులు భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసేందుకు సోమవారమే మంత్రుల బృందం సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేసిందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దాదాపు 8 నుండి 10 లక్షల మంది భక్తులు నేపథ్యంలో ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా పటిష్ట ప్రణాళిక రూపొందించుకుని ఆ మేరకు వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

