మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలో ఏపీ మంత్రి ఆర్కే రోజా పర్యటిస్తున్నారు. మంత్రి రోజాకు అక్కడి తెలుగు సంఘం సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్ట్రేలియాలోని తెలుగు సంఘం ఆహ్వానం మేరకు రోజా అక్కడ పర్యటనకు వెళ్లారు. రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణి కూడా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.
ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఏపీ మంత్రి ఆర్కే రోజా మెల్బోర్న్ చేరుకున్నారు. మెల్బోర్న్ విమానాశ్రయంలో ఆమెతోపాటు ఆమె భర్త సెల్వమణికి ఘన స్వాగతం పలికారు. ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రి రోజా పాల్గొననున్నారు. తెలుగు సంఘాలు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంత్రి రోజా మూడు రోజులపాటు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు.