YS Jagan | జగన్‌కు 11 సీట్లు ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పారు.. వైసీపీ అధినేతపై కడప ఎమ్మెల్యే ఫైర్
YS Jagan | ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాయడం సిగ్గు చేటు అని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష హోదా కావాలని జగన్ కోరడం హేయమైన చర్య అని అన్నారు.
YS Jagan | ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాయడం సిగ్గు చేటు అని కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష హోదా కావాలని జగన్ కోరడం హేయమైన చర్య అని అన్నారు.
ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్‌కు కనీస అవగాహన లేదని ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు. మొత్తం సభ్యుల్లో పదో వంతు ఉంటేనే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారని వివరించారు. ప్రజలకు ముఖం చూపించుకోలేకనే జగన్ కొత్త కుయుక్తులకు తెరలేపారని ఆరోపించారు. స్పీకర్ ఎన్నిక రోజు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదని మండిపడ్డారు. జగన్‌కు 11 సీట్లు ఇచ్చి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో ప్రతి ఒక్కరూ ఎంతగానో నష్టపోయారని పేర్కొన్నారు.
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పేర్కొంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం నాడు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యనపాత్రుడికి లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని వైఎస్ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని.. ముందే నిర్ణయించినట్లు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదని తెలిపారు. అటు పార్లమెంటులో గానీ.. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఈ నిబంధనను ఇప్పటిదాకా ఎప్పుడూ పాటించలేదని గుర్తుచేశారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సూచించారు.
కూటమి ప్రభుత్వం, స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని జగన్ వాపోయారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు ఇటీవల బయటపడ్డాయని తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే సమస్యలను వినిపించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ అంశాలను స్పీకర్ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
తమ పార్టీ కార్యాలయాలే లక్ష్యంగా టీడీపీ విధ్వంసం సృష్టిస్తోందని వైసీపీ ఆరోపించింది. విజయవాడ, విజయనగరం పార్టీ కార్యాలయాల్ని కక్షపూరితంగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించింది. చంద్రబాబు ఇచ్చిన జీవోలతో టీడీపీ కట్టిన పార్టీ కార్యాలయాలను వదిలేసి.. అధికారులతో వైసీపీకి బలవంతంగా కూటమి ప్రభుత్వం నోటీసులు ఇప్పిస్తున్నదని పేర్కొంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

