Undavalli Arunkumar | ఏపీలో వైఎస్సార్ సీపీకి మనుగడ కష్టమే : మాజీ ఎంపీ ఉండవల్లి
Undavalli Arunkumar | మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్(Undavalli Arunkumar) ఏపీలో అధికార వైసీపీ భవిష్యత్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు.
అమరావతి : మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్(Undavalli Arunkumar) ఏపీలో అధికార వైసీపీ భవిష్యత్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీ లక్ష్యాలు, ఆశాయాలను పాటించకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ మనుగడ కష్టమేనని అన్నారు. శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పార్టీ పరంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో తీసుకుంటున్న చర్యలపై స్పందించారు.
ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత అనే సాకుతో వారిని మార్చడం అనే ప్రక్రియ అన్ని సమయాల్లో సముచితం కాదని సూచించారు. సీట్ల మార్పుపై వ్యూహాత్మకంగా వ్యవహరించక పోతే నష్టం తప్పదని హెచ్చరించారు. సగం వరకు సిట్టింగ్ స్థానాల్లో మార్పులు, చేర్పులు చేస్తుండడం వల్ల సొంత పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నారని, దీని వల్ల రాబోయే ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు.
వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు పవర్ లేకుండా చేయడంతో ఎమ్మెల్యేల పని సామర్ధ్యం ఎక్కడ పెరుగుతుందని అన్నారు. సంక్షేమాల పేరిట ప్రభుత్వ నిధులను ప్రజలకు పంపిణీ చేయడం ఒక్కటే సరిపోదని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

