Indrakeeladri | భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి.. దీక్షలను విరమించిన భవానీలు
Indrakeeladri | భవానీ దీక్షల విరమణ చివరి రోజు కావడంతో విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది.
అమరావతి : భవానీ దీక్షల (Bhavani Devotees) విరమణ చివరి రోజు కావడంతో విజయవాడలోని ఇంద్రకీలాద్రి (Indrakeeladri ) భక్తులతో కిటకిటలాడింది. బుధవారం తెల్లవారుజాము నుంచే భవానీ భక్తులు కృష్ణానది ఒడ్డున స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్ని క్యూలైన్లల్లో ఆలయ అధికారులు భక్తులకు ఉచిత దర్శనం కల్పించారు. క్యూలో నిలుచున్న భక్తులకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వివరించారు.
అమ్మవారి దర్శనం అనంతరం భవానీ ఘాట్, పున్నమి ఘాట్, సీతమ్మవారి పాదాల సమీపంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక కేశఖండన శాల వద్ద దీక్షాదారులు తలనీలాలు సమర్పించుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు(Tamilnadu) , కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా నుంచి భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు.
భవానీ దీక్షాదారులు వయసుతో తారతమ్యం లేకుండా ఏడు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ (Giripradakshina) చేశారు. భవానీలతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఆలయ ఈవో రామారావుతో పాటు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, సంబంధిత శాఖల అధికారులు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భక్తుల రద్దీ, దర్శనాలు, ఇతర సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 21న ప్రారంభమైన దీక్షల విరమణ బుధవారంనాటితో ముగుస్తుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

