Nagababu | నాకు పదవులపై కోరిక లేదు.. మెగా బ్రదర్ నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Nagababu | పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలబడింది. పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందజేసింది. జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో.. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చెక్కును జనసేన నేత నాగబాబు అందించారు.
Nagababu | పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలబడింది. పార్టీ కోసం పనిచేసి మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందజేసింది. జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో.. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చెక్కును జనసేన నేత నాగబాబు అందించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. తనకు పదవులపై కోరిక లేదని స్పష్టం చేశారు.
వివిధ కారణాల వల్ల చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఇప్పటిరకు రూ.1745 కోట్లు అందజేశామని నాగబాబు తెలిపారు. గతంలో మూడు వేల మంది రైతులకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకప్పుడు నిర్మాతగా తాను నష్టపోతే తన తమ్ముడు అండగా నిలిచాడని నాగబాబు గుర్తుచేసుకున్నారు. అందుకే తాను కూడా తనవంతుగా ఎంతో కొంత సాయం అందిస్తానని చెప్పారు. తనకు పదవులపై కోరిక లేదని తెలిపారు. పవన్ కల్యాణ్ ఆశయాలు నిలబెట్టేందుకు తనకు చేతనైనంత చేస్తానని అన్నారు. తనకు ఓపిక ఉన్నంత వరకు జనసేన కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజుల్లోనే వైసీపీ శవ రాజకీయాలు చేయడం మొదలుపెట్టిందని నాగబాబు విమర్శించారు. గత ఐదేళ్లలో వారు చేసిన నేరాలు, ఘోరాలు బయటపెడతామని తెలిపారు. అబద్ధాలు చెప్పడంలో జగన్‌కు డాక్టరేట్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. నేడు ఏపీలోరాష్ట్రపతి పాలన అడగడానికి జగన్‌కు సిగ్గుండాలని అన్నారు. ఇంతకంటే దిగజారకండి అని చెప్పే కొద్దీ మరింత దిగజారుతున్నారని అన్నారు. జగన్ హయాంలో జరిగిన అవినీతికి శిక్ష తప్పదని హెచ్చరించారు.
కూటమి అధికారంలోకి రావడం వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఐదేళ్లు ఏపీలో స్వర్ణయుగం నడుస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారథ్యంలో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

