ఆకాశగంగ వద్ద తొలిసారిగా హనుమాన్ జయంతి వేడుకలు: టీటీడీ ఈవో

తిరుమల: తిరుమల క్షేత్రంలోని అంజనాద్రి కొండపై ఆంజనేయస్వామి వారు జన్మించిన ఆకాశ గంగ తీర్థం వద్ద హనుమాన్ జయంతి వేడుకలను శుక్రవారం తొలిసారిగా ప్రారంభించినట్లు టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి తెలిపారు. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలను అకాశగంగ, జాపాలి వద్ద నిర్వహిస్తామని చెప్పారు.
ఉత్సవంలో భాగంగా ఆకాశగంగ వద్ద అంజనాదేవి, బాల ఆంజనేయస్వామివారికి నిర్మించిన ఆలయంలో అభిషేకం, తమలపాకులతో పూజ, మల్లె పూలతో అర్చన నిర్వహించామన్నారు. అదేవిధంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి, మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహానికి అభిషేక, అర్చన, నివేదనలు నిర్వహించినట్లు తెలిపారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపధ్యంలో ఇక్కడకు రాలేని భక్తులు ఎస్వీబిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి స్వామివారి అనుగ్రహనికి పాత్రులు కావాలని కోరారు. ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు చేసిన టీటీడీ సిబ్బందిని ఆయన అభినందించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

