ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..గోడకూలి ఒకరు మృతి
Heavy Rains|ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోనెగండ్ల, దేవనకొండల, ఆస్పరి, హాలహర్వి మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని గాజుల దిన్నె ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ జలాశయానికి 20వేల క్యూసెక్కుల నీరు వస్తుందని అధికారులు వెల్లడించారు.
ప్రాజెక్టు 4గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ముందుజాగ్రతగా గోరెగండ, కోడుమూరు మండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆలూరు మండలంలో కుండపోతగా వర్షం పడడంతో హత్తిబెలగళ్ నుంచి అర్థగేరికి వెళ్లే రహదారి తెగిపోయింది. ఆదోని పట్టణం పరిషమల్లలో వర్షానికి ఇల్లు కూలి ఫారిద్ సహీద్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
అనంతపురం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. జిల్లాలోని నడిమివంక వాగు ఉద్ధృతి కొనసాగుతుంది. దీంతో నడిమివంక పరివాహక ప్రాంతాల్లో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు వెయ్యిమందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. రాయదుర్గంలో ఇళ్లలోకి పెద్ద చేపలు కొట్టుకువచ్చాయి. వరద ప్రవాహానికి కారు, ద్విచక్రవాహనాలు దెబ్బతిన్నాయి. కణేకల్ రోడ్డులో భారీ వృక్షం నేల వాలింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

