TTD | శ్రీవారి భక్తుల ఆరోగ్య భద్రతే ప్రథమ కర్తవ్యం : టీటీడీ అదనపు ఈవో
TTD | తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడంతోపాటు వారి ఆరోగ్య భద్రతే టీటీడీ కర్తవ్యమని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు.
తిరుమల : తిరుమల (Tirumala) కు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడంతోపాటు వారి ఆరోగ్య భద్రతే టీటీడీ(TTD ) కర్తవ్యమని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. టీటీడీ ఆరోగ్య విభాగం, ఆహార భద్రత విభాగాలతో కలిసి తిరుమలలోని హోటళ్ల నిర్వాహకులకు, యజమానులకు బుధవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ (Food Safety) నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే తినుబండారాలు తయారు చేయాలని అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని హోటళ్లలో ప్రమాణాలు పాటించాలన్నారు. హోటళ్లలో (Hotels) పరిశుభ్రత, ఆహార పదార్థాలు నిల్వ చేయడం, వడ్డించడం వంటి విధానాలను ఎప్పటికప్పుడు పరిశీలించి క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.
న్యూ ఢిల్లీకి చెందిన ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫైడ్ ట్రైనర్ సిహెచ్ ఆంజనేయులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ను వివరించారు. టీటీడీ ఆరోగ్య శాఖ డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి తిరుమలలో హోటళ్ల వ్యాపారులందరికీ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

