Gundlakamma Reservoir | కొట్టుకుపోయిన గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు గేటు.. వృథాగా పోతున్న నీరు
Gundlakamma Reservoir | ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయింది. మల్లవరం కందుల ఓబుల్‌రెడ్డి (గుండ్లకమ్మ రిజర్వాయర్) ప్రాజెక్టు 3వ గేటు గతంలోనే కొట్టుకుపోయింది.
హైదరాబాద్ : ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయింది. మల్లవరం కందుల ఓబుల్‌రెడ్డి (గుండ్లకమ్మ రిజర్వాయర్) ప్రాజెక్టు 3వ గేటు గతంలోనే కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో మరమ్మతులు జరగలేదని ఆరోపణలుండగా శుక్రవారం రాత్రి రెండో గేటు అడుగు భాగం మిగ్జాం వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో ప్రాజెక్టులోని నీరు వృథాగా పోతుంది. అయితే రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు దిగువ ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది. ప్రాజెక్టులో ప్రస్తుతం 2.5 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, నీరు వృథాగా కిందికి పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2022వ సంవత్సరంలో 3వ నంబర్ గేటు కొట్టుకుపోవటంతో పూర్తిస్థాయిలో ఇప్పటి వరకు మరమ్మతులు పూర్తికాలేదు. అధికారుల నిర్లక్ష్యంతో మరోగేటు కొట్టుకు పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

