Good News | ఏపీలో గీతకార్మికులకు గుడ్‌న్యూస్.. మద్యం దుకాణాల కేటాయింపులో10శాతం రిజర్వేషన్లు
Good News | గీత కార్మికులకు Geetha workers | ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాబోయే మద్యం నూతన పాలసీ లో గీతకార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు మంత్రి వర్గ సబ్ కమిటీ వెల్లడించింది.
అమరావతి : గీత కార్మికులకు (Geetha workers) ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్(Good News) చెప్పింది. రాబోయే మద్యం నూతన పాలసీ (New Policy) లో గీతకార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు మంత్రి వర్గ సబ్ కమిటీ వెల్లడించింది. విజయవాడలో మంత్రి వర్గ సభ్యులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యప్రసాద్ యాదవ్ ,కొండపల్లి శ్రీనివాస్ నూతన మద్యం పాలసీపై తయారు చేసిన నివేదిక వివరాలను విలేకరులకు వివరించారు.
ప్రజారోగ్యం దృష్ట్యా కొత్త ఎక్సైజ్ విధానం తీసుకువస్తున్నామని వారు ప్రకటించారు. వినియోగదారుడికి నాణ్యమైన, అందుబాటులో ధరకే మద్యాన్ని అందించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో సంఘాలు, అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నామని, రేపు జరుగునున్న క్యాబినేట్ సమావేశంలో నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పిస్తామని వెల్లడించారు.
గత ప్రభుత్వ తప్పుడు విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ధరలు యథేచ్చగా పెంచారని ఆరోపించారు. మల్టినేషనల్ బ్రాండ్‌ను రాష్ట్రానికి రానియకుండా అడ్డుకుని సొంత బ్రాండ్ పేరుతో విచ్చలవిడిగా విక్రయాలు చేశారని విమర్శించారు. ప్రభుత్వ ఆదాయం గత పాలకుల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. రాష్ట్రంలో మొదటిసారిగా ప్రిమియం అవుట్‌లెట్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

