అమరావతి : ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని భైరవపాలెం మొగలో మత్స్యకారుల బోటు మునిగిపోయింది. భైరవపాలెం గ్రామానికి చెందిన చింత శ్రీను బోటుపై తొమ్మిది మంది మత్స్యకారులు వేటకు వెళ్లారు. తెల్లవారుజామున గాలి వేగంగా వీయడంతో ప్రమాదవశాత్తు సముద్రంలో బోటు మునిగిపోయింది. ఈ క్రమంలో మరొక బోటు సహాయంతో మత్స్యకారులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కోనసీమ జిల్లాలో మత్స్యకారుల బోటుకు ప్రమాదం
భైరవపాలెం మొగలో మునిగిపోయిన మత్స్యకారుల బోటు
భైరవపాలెం గ్రామానికి చెందిన చింత శ్రీను బోటుపై వేటకు వెళ్లిన తొమ్మిది మంది మత్స్యకారులు
తెల్లవారుజామున గాలి వేగంగా వీయడంతో ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిన బోటు
మరొక బోటు సహాయంతో… pic.twitter.com/wL8yanvkrc
— Telugu Scribe (@TeluguScribe) September 21, 2026