త్వరలో విశాఖలో అందుబాటులోకి ఇగ్లూ సినిమా హాల్
విశాఖపట్నం వాసులకు ఇగ్లూ థియేటర్ అనే మరో సినిమాటిక్ అనుభవం అందుబాటులోకి రానున్నది. ఇగ్లూ సినిమా థియేటర్ తొలుత తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల పట్టణం సమీపంలోని రాజారాంపల్లెలో ఏర్పాటైంది. దానిని ఆదర్శంగా తీసుకుని...
విశాఖ: ప్రజలు సినిమాకి వెళ్లాలనుకుంటే సాధారణ థియేటర్ లేదా మల్టీప్లెక్స్‌కి వెళ్తారు. అయితే, అతి త్వరలో విశాఖపట్నం వాసులకు ఇగ్లూ థియేటర్ అనే మరో సినిమాటిక్ అనుభవం అందుబాటులోకి రానున్నది. ఇగ్లూ సినిమా థియేటర్ తొలుత తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల పట్టణం సమీపంలోని రాజారాంపల్లెలో ఏర్పాటైంది. దానిని ఆదర్శంగా తీసుకుని ఈ ఇగ్లూ మూవీ హాల్‌ను నెలకొల్పుతున్నారు. దాదాపు కోటి రూపాయల అంచనా వ్యయంతో ఈ సినిమా థియేటర్‌ను నిర్మిస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ముంబైలోని చోటూ మహారాజ్ ఇగ్లూ సినిమా థియేటర్ నుంచి ప్రేరణ పొందారు. ఇది ఎస్కిమోలు తయారుచేసుకునే ఇగ్లూ ఇండ్ల మాదిరిగానే ఉంటుంది.
ఈ ఇగ్లూ సినిమా థియేటర్ విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్ ఫ్లై ఓవర్ సమీపంలోని ఎ స్క్వేర్ గో-కార్టింగ్ వద్ద రానున్నది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలాఖరుకు థియేటర్ని సిద్ధం చేయాలని యాజమాన్యం భావిస్తున్నది. ఆగస్ట్‌లో థియేటర్‌ను ప్రారంభించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తున్నది. ఈ థియేటర్‌ను కేవలం 500 గజాల స్థలంలోనే నిర్మిస్తుండటం విశేషం. ఈ మినీ థియేటర్లో 100 మంది కూర్చునేలా సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. మల్టీప్లెక్స్‌లతో సమానంగా ఏసీ, హైక్వాలిటీ సరౌండ్ సిస్టమ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఇప్పటివరకు ప్రజలు వినోదం కోసం తరచుగా పార్కులు, సినిమాలను సందర్శిస్తుంటారు. అయితే సినిమా థియేటర్ కూడా ప్రత్యేకంగా ఉంటుందని చాలా మంది ఊహించి ఉండరు? నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మల్టీప్లెక్సులు పుట్టుకొస్తున్నాయి. ఇవి ప్రస్తుతం ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అయితే, ఇదేమాదిరి సౌకర్యాలు, వినోదం గ్రామస్తులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ఇగ్లూ థియేటర్లు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయని చెప్పవచ్చు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

