AP News | మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్ మంజూరు
AP News | కర్నూలు జిల్లాలో టీడీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడి కేసుల్లో అరెస్టయిన మాజీ మంత్రి అఖిలప్రియకు(Akhilapriya) కోర్టు బెయిల్(Bail) మంజూరు చేసింది.
అమరావతి : కర్నూలు జిల్లాలో టీడీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడి కేసుల్లో అరెస్టయిన మాజీ మంత్రి అఖిలప్రియకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 17న కర్నూలు జిల్లా నంద్యాలలో నారా లోకేశ్ నిర్వహిస్తున్న పాదయాత్ర సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో ఇరువర్గాలు ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లలో స్థానిక టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి(AV Subbareddy), మాజీ మంత్రి అఖిలప్రియ(AkhilaPriya) మధ్య విభేదాలు ఏర్పడి ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ స్థానిక పోలీసు స్టేషన్లో కేసు(Police case) నమోదు కావడంతో 17వ తేదీన పోలీసులు అఖిలప్రియను, ఆమె భర్తను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరచగా వారికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కాగా ఆమె బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా బుధవారం కండిషన్ బెయిల్(Condition Bail) మంజూరు చేసింది. పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేసే వరకు ప్రతి గురు, శుక్రవారాల్లో నంద్యాల పీఎస్‌లో సంతకం చేయాలని అఖిలప్రియ దంపతులను కోర్టు ఆదేశించింది .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

