జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్.. రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్
JC Prabhakar reddy | మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాకిచ్చింది. బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు సంబంధించి ప్రభాకర్ రెడ్డి కంపెనీకి చెందిన రూ.22.10 కోట్ల
హైదరాబాద్: మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాకిచ్చింది. బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు సంబంధించి ప్రభాకర్ రెడ్డి కంపెనీకి చెందిన రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఆయన అనుచరుడు గోపాల్‌రెడ్డి ఆస్తులను కూడా అటాచ్ చేసింది. వీటిలో దివాకర్ రోడ్‌లైన్స్, జటధా ఇండస్ట్రీస్, సి.గోపాల్ రెడ్డి అండ్ కో ఆస్తులు కూడా ఉన్నాయి.
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించామని ఈడీ పేర్కొన్నది. జటధర ఇండస్ట్రీస్, గోపాల్‌రెడ్డి అండ్ కో బీఎస్-4 వాహనాలను కొనుగోలు చేసిందని చెప్పారు. వాటి రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా నకిలీ ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. గడువు తీరి విక్రయం కాకుండా ఉన్న 154 లారీలను నాగాలాండ్‌లో స్క్రాప్ కింద కోనుగోలు చేశారు. వాటిని 2018లో నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేశారు. వీటిలో కొన్నింటిని ఇతరులకు విక్రయించారు. మరికొన్నింటిని జేసీ కంపెనీ నిర్వహిస్తుంది. అయితే ఈ వాహనాలు కొనుగోలు చేసిన కొందరు.. నకిలీ పత్రాలతో తమకు కట్టబెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదుచేసిన ఈడీ.. విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా జేసీ సోదరుల ఇండ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇప్పటికే విచారించిన విషయం విధితమే.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

