Cyclone Murasu | ఏపీ తీరాన్ని దాటిన తీవ్ర తుపాను ‘మురాసు’.. గంటకు 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
Cyclone Murasu | తీవ్ర తుపాను ‘మురాసు’ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. నెల్లూరు, నర్సాపూర్ మధ్య ఒంగోలుకు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Cyclone Murasu | తీవ్ర తుపాను ‘మురాసు’ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. నెల్లూరు, నర్సాపూర్ మధ్య ఒంగోలుకు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఆ సమయంలో గంటకు 100–110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు నమోదయ్యాయని తెలిపింది.
మంగళవారం ఉదయం 5.30 గంటల సమయానికి తుపాను ఒంగోలు సమీపంలో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్టు ఐఎండీ పేర్కొంది. ఇది గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్నదని వివరించింది. బాపట్లకు నైరుతి దిశలో 40 కిలోమీటర్లు, కావలికి ఉత్తర ఈశాన్య దిశలో 80 కిలోమీటర్లు, మచిలీపట్నానికి పశ్చిమ నైరుతి దిశలో 120 కిలోమీటర్లు, నెల్లూరుకు ఉత్తరంగా 130 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రం ఉన్నట్టు వెల్లడించింది.
క్రమంగా బలహీనపడనున్న తుపాను
మురాసు తుపాను ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. మంగళవారం మధ్యాహ్నానికి తీవ్ర తుపాను స్థాయి నుంచి తుపానుగా మారుతుందని తెలిపింది. ఆ సమయంలో గంటకు 80–90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. అర్ధరాత్రి సమయానికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. అప్పుడు గంటకు 55–65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఒంగోలులోనూ తుపాను ప్రభావం స్పష్టంగా కనిపించింది. బలమైన ఈదురుగాలులకు చెట్లు వంగిపోయాయి. భారీ వర్షంతో జనజీవనం ప్రభావితమైంది. మచిలీపట్నం, విశాఖపట్నంలోని డాప్లర్ వాతావరణ రాడార్ల ద్వారా తుపానును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు ఐఎండీ వెల్లడించింది.
చెన్నై తీరంలో ఎగసిపడుతున్న అలలు
తుపాను ప్రభావంతో చెన్నై తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మంగళవారం ఉదయం సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. మరోవైపు పుదుచ్చేరిలో అర్ధరాత్రి నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. తుపాను బయటి వర్ష మేఘాల ప్రభావంతో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Murasu | ఏపీ తీరాన్ని దాటిన తీవ్ర తుపాను ‘మురాసు’.. గంటకు 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
OTT Movies | ఓటీటీలో ఈ వారం ఏకంగా 24 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి అంటే?
Tabu | నాగార్జున 100వ సినిమాలో టబు స్పెషల్ రోల్.. గ్లింప్స్ ఎప్పుడు విడుదల కానుంది అంటే..!
Hair Thinning | జుట్టు రాలకపోయినా పలుచబడుతోందా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నిరుద్యోగులకు ‘ప్రెసిడెన్షియల్’ షాక్.. 4 జిల్లాల్లో పోలీసు ఉద్యోగార్థుల కడుపుకొట్టిన కాంగ్రెస్!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

