ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ చర్చలు షురూ..!
ap prc discussions| ఏపీలో ఉద్యోగుల పీఆర్సీపై స్టీరింగ్ కమిటీ సభ్యులతో మంత్రులు సచివాలయంలోని రెండో బ్లాక్2 ఆర్థిక శాఖ మీటింగ్ హాల్లో
అమరావతి : ఏపీలో ఉద్యోగుల పీఆర్సీపై స్టీరింగ్ కమిటీ సభ్యులతో మంత్రులు సచివాలయంలోని రెండో బ్లాక్2 ఆర్థిక శాఖ మీటింగ్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన, బొత్స, పేర్ని నానితో పాటు స్టీరింగ్ కమిటీ లోని 20 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చర్చల్లో మిగిలిపోయిన ఉద్యోగ సమస్యలు హెచ్ఆర్ఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శ్లాబులో సీసీఏ రద్దు వంటి అంశాల్లో స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ సభ్యుడు వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ ఇవాళ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. నిన్న జరిగిన చర్చల్లో సమ్మె నోటీస్‌లో పేర్కొన్న అన్ని సమస్యలను మంత్రుల ఎదుట ఉంచామని, రాత్రి కొన్ని అంశాలపై సానుకూలత వ్యక్త మైందన్నారు. మరి కొన్నింటిపై ఈరోజు చర్చించే అవకాశం ఉందన్నారు. కేంద్ర పీఆర్సీ కాకుండా ఐదేండ్ల కొకసారి పీఆర్సీ చేస్తామని మంత్రులు స్పష్టం చేయడం సానుకూల అంశమన్నారు. ఇప్పటికీ చర్చల పట్ల ఆశాజనకంగా ఉన్నామని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

