Chandra Babu | ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు.. మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం
Chandra Babu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. చంద్రబాబుతోపాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, మంత్రులుగా మరో 23 మంది నేతలు కూడా ప్రమాణస్వీకారం చేశారు.
Chandra Babu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. చంద్రబాబుతోపాటు పవన్ కళ్యాణ్, మరో 23 మంది నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రముఖ నటులు చిరంజీవి, రజినీకాంత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఎల్జేపీ చీఫ్, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, మాజీ గవర్నర్ తమిళిసై, తదితరులు హాజరయ్యారు.
#WATCH | Vijayawada: N Chandrababu Naidu takes oath as the Chief Minister of Andhra Pradesh. pic.twitter.com/322vQpIbQ4
— ANI (@ANI) June 12, 2024
కాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగోసారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు.. నవ్యాంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావడం ఇది రెండోసారి. 1978లో చంద్రగిరి నుంచి చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980 నుంచి 1983 వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1995లో ఉమ్మడి ఏపీ సీఎంగా తొలిసారిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. 1999లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. 2019 నుంచి 2024 వరకు నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందికి చోటు దక్కింది. పవన్‌తోపాటు మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తదితరులు తొలిసారి ఎమ్మేల్యేలుగా గెలిచారు.
పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్థన్ రెడ్డి తదితరులు గతంలో పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ మంత్రివర్గంలో ఎప్పుడూ చోటు దక్కించుకోలేదు. కానీ ఇప్పుడు తొలిసారిగా వీరికి ఆ అవకాశం లభించింది. మొత్తంగా 17 మంది కొత్తవాళ్లు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. జనసేనకు మూడు, బీజేపీకి ఒక స్థానం కల్పించారు. మరో స్థానాన్ని ఖాళీగా ఉంచారు. గత కొన్ని రోజుల నుంచి మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేసిన చంద్రబాబు.. సీనియర్లు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ జాబితాను రూపొందించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

