Chanda Babu | ఏపీ అసెంబ్లీలో ఎక్సైజ్‌శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
Chanda Babu |వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్‌శాఖలో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు.
అమరావతి : వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్‌శాఖలో(Excise) జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu) శ్వేతపత్రం విడుదల చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల మూడో రోజున బుధవారం ప్రశ్నోత్తరాల సమయం అనంతరం ఎక్సైజ్‌శాఖపై శ్వేతపత్రాన్ని (White Paper) విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవు తాయని అన్నారు. నేరస్థుడే రాజకీయాల అధినేత, సీఎం అయితే ఏం జరుగుతుందో గత ఐదేళ్లు చూశామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. కూటమి విడుదల చేస్తున్న 7 శ్వేతపత్రాలు చూస్తూ రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుందని అన్నారు.
పాలన ఎలా ఉండకూడదో గత ఐదేళ్లలో చూశామని అన్నారు. కొంతమంది అవసరాలకు తప్పుచేస్తారు. కొంతమంది అత్యాశతో చేస్తారు. కొంతమంది డబ్బుల ఉన్మాదంతో తప్పు చేస్తారని, దీనివల్లే వ్యవస్థలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ప్రజలకు హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలని అన్నారు. పరిపాలన ప్రజల కోసం చేయాలని , సంక్షేమం, అభివృద్ధి బేరీజు వేసుకుంటూ వెళ్లాలని సూచించారు.
అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో మద్యం నిషేదమని చేస్తామని హామీ ఇస్తునే విక్రయాలను విపరీతంగా పెంచారని ఆరోపించారు. క్వాలిటీ లేని మద్యం విక్రయించి కోట్లు దండుకున్నారని విమర్శించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. 64 శాతం నేరాల శాతం పెరిగిందన్నారు. ఐదు టాప్ బ్రాండ్ల కంపెనీలను తరిమేశారని , లోకల్ బ్రాండ్ల కంపెనీలు విపరీతంగా పెంచారని ఆరోపించారు.
Read more :
YS Jagan | ఏపీలో ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యం: వైఎస్ జగన్
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CBI Raids | రైస్ మిల్లర్లపై సీఐడీ దాడులు… నిజామాబాద్, కరీంనగర్, ములుగులో అక్రమాలు
RTC Conductor | కండక్టర్ ప్రాణం మీదికి తెచ్చిన ‘చిల్లర’.. భద్రాద్రి జిల్లాలో దారుణం
‘స్పెషల్’ పెట్టకుండానే బాదుడు.. బస్ పాయింట్లలో కనిపించని రెగ్యులర్ బస్సులు!
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

