సీఎం అయ్యాకే సభలో అడుగు పెడుతా.. చంద్రబాబు శపథం
Chandrababu | టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. సీఎం అయ్యాకే ఈ సభలో తిరిగి అడుగుపెడతానంటూ చంద్రబాబు శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే ఇవాళ

అమరావతి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. సీఎం అయ్యాకే ఈ సభలో తిరిగి అడుగుపెడతానంటూ చంద్రబాబు శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసి దూషణలకు దిగారు. మంత్రి కొడాలి నాని.. చంద్రబాబును లుచ్చా అని తీవ్రమైన పదజాలంతో దూషించారు. మంత్రి కన్నబాబు, ఇతర ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబు సతీమణిపై కూడా వైసీపీ నాయకులు నోరు పారేసుకున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన చంద్రబాబు కంటతడి పెట్టారు. అనంతరం ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.
పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశాం. జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశాం. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నాం. ఏనాడూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు నేను చూడలేదు. అదే విధంగా ఇన్నేళ్లుగా జరగని అవమానాలను భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి.. కుప్పం ఎన్నికల తర్వాత నేను రావాలి. నా ముఖం చూడాలన్నా కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్‌లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలున్నాయి. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా విమర్శించారు. ఇన్ని సంవత్సరాలుగా ఏ పరువు కోసం పని చేశానో.. ఇన్నేళ్లుగా బతికామో.. నా కుటుంబం, నా భార్య విషయం కూడా తీసుకొచ్చి(మాట్లాడుతుండగానే మైక్ కట్ చేసిన స్పీకర్) అవమానించారు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా అని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

