AP CEO Meena | ఏపీలో ఎన్నికల సిబ్బందికి సీఈవో కీలక సూచనలు
AP CEO Meena | ఈనెల 4న ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కి్ంపు పటిష్టవంతంగా నిర్వహించాలని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఎన్నికల సిబ్బంది కీలక ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి : ఈనెల 4న ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కి్ంపు (Counting) పటిష్టవంతంగా నిర్వహించాలని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా (CEO MK Meena) ఎన్నికల సిబ్బంది కీలక ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపులో పొరపాట్లకు తావివ్వవొద్దని సూచించారు. ఆదివారం సచివాలయం నుంచి రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) లో ఎన్నికల అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
కచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన వివరాలపై సూచనలు చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్, ఎన్కోర్లో ఫీడింగ్, అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాటుపై చర్చించారు.
ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత ఈవీఎం (EVM) లను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టేట్యుటరీ నివేదిక, రౌండ్ వైజ్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ రోజున మూడంచెల పటిష్ట భద్రతాను ఏర్పాటు చేసుకోవాలని ఆయన వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

