Arjitasevas | తిరుచానూరు పద్మావతి ఆలయంలో ఆర్జితసేవలు రద్దు
Arjitasevas | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
తిరుపతి : తిరుచానూరు (Tiruchanur ) శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవల (Arjitasevas ) ను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. జూన్ 17 నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు (Theppotsavam) జరుగనున్నాయని వివరించారు. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.
జూన్ 17న మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారని వెల్లడించారు. జూన్ 20న రాత్రి 8.30 గంటలకు గజవాహనం, 21న రాత్రి 8.30 గంటలకు గరుడ వాహనసేవను ఘనంగా నిర్వహించనున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం (Kalyanotsavam), ఊంజల్‌సేవ, జూన్ 21న లక్ష్మీ పూజను రద్దు చేశామని పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | ‘టాక్సిక్’ రిజల్ట్ నన్ను కుంగదీసింది : కియారా అద్వానీ
Pat Cummins: క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌తో సిడ్నీ వీధిలోనే గొడవపడ్డ భార్య.. వీడియో
Shekhar Master | కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన వ్యాన్
భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు తప్పనిసరి : ఎంపీడీవో పుల్లారావు
Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

