Vangalapudi Anitha | మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు.. జగన్‌పై హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్
Vangalapudi Anitha | మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అక్కసుతోనే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు.
Vangalapudi Anitha | మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అక్కసుతోనే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. వినుకొండలో జరిగిన వ్యక్తిగత హత్యపై జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శకు వెళ్లి బాధితులకు భరోసా ఇవ్వకుండా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని అన్నారు.
కూటమి ప్రభుత్వంపై జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ ఆరోపిస్తున్నారని తెలిపారు. హోంమంత్రిగా దీనిపై తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని జగన్‌ను అడిగారు. ఒకవేళ సమాచారం ఇవ్వకపోతే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగు రాజకీయ హత్యలు మాత్రమే జరిగాయని, వీటిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలే మరణించారని స్పష్టం చేశారు.
ప్రభుత్వంపై బురద జల్లడానికే ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తున్నారని వంగలపూడి అనిత మండిపడ్డారు. ప్రభుత్వంపై టార్గెట్‌గా ఎవరు అసత్య ప్రచారాలు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలపై అసెంబ్లీలో చర్చించే దమ్ముందా అని జగన్‌ను ప్రశ్నించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

