గాంధీజీ బోధనలు స్ఫూర్తిదాయకం : ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్
గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం స్మరించుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి ఆయన ఘనంగా నివాళులర్పించారు.
అమరావతి: గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం స్మరించుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఆయన 153 వ జయంతి సందర్భంగా స్వాతంత్య్ర ఉద్యమంలో సత్యం, అహింస మార్గం ఎంచుకుని మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. గాంధీజీ బోధనలు ప్రపంచ నాయకులకు స్ఫూర్తిదాయకమని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలకు పునరంకితం అవుతాం అని ప్రతిజ్ఞ చేయాలని ప్రజలను కోరారు.
‘దేశం కోసం మహాత్మా గాంధీ అత్యున్నత త్యాగం, శాశ్వతమైన బోధనలు మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయి. గాంధీజీ బోధనలు ఎల్లప్పుడూ ప్రపంచ నాయకులకు ప్రేరణగా ఉన్నాయి. మహాత్ముడు చేపట్టిన శాంతియుత ప్రతిఘటన, సామూహిక శాసనోల్లంఘన మార్గాలను విశ్వవ్యాప్తంగా అనుకరించారు. గాంధీజీ చాలా సాదాసీదా జీవితాన్ని గడిపారు. తన అహింసా బోధనలతో భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చారు. గాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా జరుపుకుంటారు. ఈ రోజున మనమందరం జాతిపిత అడుగుజాడల్లో నడుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. సత్యం, అహింస సూత్రాలకు పునరంకితమవుదాం’ అని రాజ్‌భవన్ నుంచి వెలువడిన ఒక ప్రకటనలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

