శ్రీశైలంలో పరివార దేవతలకు అమావాస్య ప్రత్యేక పూజలు
అమావాస్య ప్రత్యేక పూజలు | శ్రీశైల ఆలయ పరివార దేవతలకు అమావాస్య ప్రత్యేక పూజలు ఇవాళ నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన కుమారస్వామికి ఉదయం షోడషోపచార పూజలు చేశారు.

శ్రీశైలం : శ్రీశైల ఆలయ పరివార దేవతలకు అమావాస్య ప్రత్యేక పూజలు ఇవాళ నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువైన కుమారస్వామికి ఉదయం షోడషోపచార పూజలు చేశారు. శివభక్త గణాలకు అధిపతి అయిన బయలు వీరభద్రునికి సాయంత్రం శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు. క్షేత్రపాలకుడిగా దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన చేశారు.
అనంతరం సంధ్యా సమయంలో వీరశిరోమండపం వద్ద కొలువైన శనగలబసవన్నకు ప్రత్యేక పూజాలు నిర్వహించారు. కరోనా మహమ్మారి తొలగిపోయి ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో బాసిల్లాలని వేదపండితులు మహా సంకల్పాన్ని పఠించారు. పంచామృతాలు, ఫలాలతోపాటు మల్లికాగుండంలోని శుద్ధజలంతో దేవతామూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునిపై స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను అధింపజేసి పంచసూక్తం, వృషభసూక్తం పఠించారు. నూతన వస్త్రాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా పెట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

