Honeytrap case | హనీట్రాప్ కేసులో కానిస్టేబుల్‌పై కేసు నమోదు.. సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Honeytrap case | పాక్ హనీట్రాప్ కేసు (Honeytrap case )లో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ (CISF) కానిస్టేబుల్ కపిల్‌పై విశాఖ పోలీసులు (Police) కేసు నమోదు చేశారు.
అమరావతి : పాక్ హనీట్రాప్ కేసు (Honeytrap case )లో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ (CISF) కానిస్టేబుల్ కపిల్‌పై విశాఖ పోలీసులు (Police) కేసు నమోదు చేశారు. అతడి వద్ద నుంచి మూడు సెల్ఫోన్ల (Cellphone)ను స్వాధీనం చేసుకుని సైబర్ ఫోరెన్సిక్‌కు పంపారు. మరో వైపు కానిస్టేబుల్ కపిల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం ప్రశ్నిస్తున్నాయి. ఈ కేసులో కపిల్‌పై కేసులునమోదు చేశామని విశాఖపట్నం సీపీ త్రివిక్రమ్ వర్మ మంగళవారం వెల్లడించారు.
గుజరాత్‌కు (Gujarat) చెందిన కపిల్ కుమార్ విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీలో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. తొలుత హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహంచి 2022 ఆగస్టు నెలలో విశాఖకు బదిలీపై వచ్చాడు. ప్రస్తుతం అతడు సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగంలో పనిచేస్తునే పేస్బుక్ ద్వారా పరిచయమైన తమీషాతో మాట్లాడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
తమీషా ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ముఖ్య నాయకుడి వద్ద వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేస్తున్నట్లు గుర్తించడంతో కపిల్‌పై నిఘా పెట్టారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోన్లను స్వాధీనం చేసుకుని అందులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

