Badam Milk | జాతరలో బాదం పాలు తాగి 80 మందికి అస్వస్థత
Badam Milk | శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో బాదంపాలు తాగి సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపులో నొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో బాధపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Badam Milk | శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో బాదంపాలు తాగి సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపులో నొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో బాధపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సింగుపురంలో ఈ నెల 1, 2వ తేదీల్లో కొండమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి వ్యాన్‌లో బాదం పాలు తీసుకొచ్చి పాత పంచాయతీ కార్యాలయం వేప చెట్టు కింద విక్రయించాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జాతరకు వచ్చిన వారిలో చాలామంది ఆ బాదం పాలు కొనుగోలు చేసి తాగారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి నుంచి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రుల బాట పట్టారు. ఈ ఘటనపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక బృందాన్ని నియమించి సమగ్ర విచారణ చేయిస్తున్నామని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

