Rose Flowers | ఏపుగా గులాబీలు పూయాలంటే.. ఇలా చేయండి..?!
Rose Flowers | గులాబీ పువ్వులు ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. మన ప్రేమను ఎదుటివారికి చూపడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఏపుగా గులాబీ పువ్వులు పూయాలంటే..
Rose Flowers | గులాబీ పువ్వులు ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం. మన ప్రేమను ఎదుటివారికి చూపడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. ప్రతి ఇంట్లోనూ పెంచుకోవడం మనం చూస్తుంటాం. కొందరు ఎంత ప్రయత్నించినా గులాబీ మొక్కలను ఇంట్లో పెంచుకోలేకపోతుంటారు. అలాగే, ఒక్కో చెట్టుకు ఒకటి, రెండు పూలు పూస్తుండటంతో మరో పువ్వు పూసేంత వరకు ఎదురుచూడాల్సి వస్తుంది. అలా కాకుండా ఏపుగా గులాబీ పువ్వులు పూయాలంటే ఏం చేయాలి..? అనేది తెల్సుకుందాం.
ఎంపిక ఇలా..
గులాబీ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకునేందుకు మేలైన రకాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా చిన్న మొక్కలకే ఎక్కువ పువ్వులు పూస్తుంటాయి. కాబట్టి పైన కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండేలా కొనుక్కోవాలి. తొలుత కుండీ అడుగున నీరు నిల్వ ఉండకుండా చూడాలి. కుండీల్లో మట్టి నింపేటప్పుడు ఇసుక, రాళ్లు లేకుండా జాగ్రత్త పడాలి. మట్టితో పాటు కంపోస్టు ఎరువును 2:1 నిష్పత్తిలో గుల్లగా చేసి కలిపి నింపుకోవాలి. నీరు పోయడానికి వీలుగా పైన 5 సెం. మీ. వరకు ఖాళీ స్థలం వదలాలి.
ఇలా నాటాలి..
గులాబీ మొక్కను నాటేప్పుడు మట్టిలోకి ఆకులు, మొగ్గలు కలిసిపోకుండా చూసుకోవాలి. మొక్కలు నిటారుగా కుండీలో దించాక చుట్టూ మట్టిని నెమ్మదిగా నొక్కాలి. మొక్కలు నాటుకున్నాక రోజూ రెండు పూటలా అవసరమైనన్ని నీళ్లు పోస్తుండాలి. కుండీల్లో మట్టి తడి ఆరిపోకుండా ఉండేందుకు ఎండిన ఆకులు, ఆవుపేడను పొరగా ఉంచాలి. ఇవి ఎరువుగా కూడా పనిచేస్తాయి. డైమిథోయేట్, మిథైలేట్ స్పిరిట్ వంటివి వాడాలి. వాడిన ఆకులు, పువ్వులు కత్తిరించి, కలుపు తీసేస్తూ ఉండాలి. మొక్కల పైన నీళ్ళు స్ప్రే చేయడం వలన వేడి, దుమ్ము ధూళి నుంచి రక్షణగా ఉంటుంది.
దన్నుగా ఇవీ..
గులాబీలు బాగా విచ్చుకున్న తర్వాత పువ్వును కోసి జానెడు వరకు కొమ్మలను కత్తిరించాలి. ఉల్లిపొట్టు, బంగాళాదుంప పొట్టు, మిగిలిపోయిన మందులను మొక్క చుట్టూ వేయాలి. వాడేసిన టీ, కాఫీ పొడులను మొక్కల మొదట్లో వేయాలి. నెలలో ఒక్కసారి రోజ్ మిక్స్ మొక్కకు జానెడు వెడల్పులో వేయాలి. ఎండిన ఆకులు కొమ్మలు ఎప్పటికప్పుడు తుంచేయాలి. మొక్క ఎంత గుబురుగా ఉంటే అంత ఎక్కువగా పూలు పూస్తాయి అని గుర్తుపెట్టుకోండి.
ఎండ లేని సమయాల్లోనే గులాబీ మొక్కకు నీరు పోయాలి. బియ్యం కడిగిన నీటిని మొక్కలకు పోస్తుండాలి. కోడిగుడ్డు పెంకులను వారం వరకే చెట్టు మొదట్లో ఉంచాలి. తినగా మిగిలిన పండ్ల ముక్కలు, తొక్కలను ఎరువుగా వాడాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎక్కువగా పూలు పూస్తాయి.
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

