ప్రకృతి సేద్యం.. దేశీ విత్తనం

మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో అధికశాతం రైతులు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా దేశీయ విత్తనాలకు గిరాకీ పెరిగింది. వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో దేశీ వరి విత్తనాలు నాటే రైతులు కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.
- బీజామృతంతో వడ్లను శుద్ధి చేయాలి. అలాగే నాట్లు వేసే ముందు నారు వేళ్ళను (తుకంలో వేర్లను) ఒకసారి శుద్ధి చేసుకోవాలి. బీజామృతంలో సున్నాన్ని సరైన మోతాదులో మాత్రమే వేయాలి. ఎక్కువైతే విత్తుకు, మొలకకు తీవ్ర నష్టం.
- ఒక పాయింట్లో రెండు మొక్కలు (కర్రలు) మాత్రమే నాటుకోవాలి.
- మొక్కకు, మొక్కకు మధ్యన 18 ఇంచులు లేదా 1.5 అడుగులు లేదా 45 సెం.మీ. దూరం ఉంచాలి. దూరంగా నాటుకొంటే కలుపు నియంత్రణ సులువవుతుంది. పిలకలు ఎక్కువ రావడానికి ‘కొనో వీడర్’ను సులువుగా తిప్పవచ్చు.
- పిలకలు ఎక్కువగా వస్తే మొక్కలు 6 అడుగుల ఎత్తు పెరిగి అధిక, అకాల వర్షాలకు పడిపోకుండా ఉంటాయి.
- మొక్కల మధ్య దూరం ఉంటే ఒక్కో పిలక నుంచి సుమారు 200 గ్రాముల వడ్లు వస్తాయి.
- దేశీ వరి విత్తనంతో, ఘన జీవామృతంతో ఎదిగే వరి మొక్క ఎత్తు.. నాట్లు వేసిన మొదటి 50 రోజులూ అడుగులోపే ఉంటుంది. పైగా నాటు వేసినట్లు అనిపించదు. అది చూసి కంగారు పడొద్దు. హైబ్రిడ్ విత్తనంతో, యూరియాతో పెరిగే మొక్క 30 రోజులలోనే ఒక అడుగు పెరుగుతుంది. ఈ కొత్త విధానంలో 50 నుంచి 100 రోజులలో దేశీ వరి పైరు 5 అడుగుల వరకు పెరుగుతుంది. అప్పటికి పిలకలు కూడా బాగా వస్తాయి.
- మెట్ట భూములలో ఈ పద్ధతి చాలా లాభదాయకంగా ఉంటుంది. వరి పంటకు తక్కువ నీరు ఉపయోగించి, ఎక్కువ దిగుబడి పొందవచ్చు. అయితే విధిగా మొక్క నాటిన 20 రోజులకు ఒకసారి, 35 రోజులకు ఒకసారి, 50 రోజులకు ఒకసారి కోనో వీడర్‌ను తిప్పాలి. 50 రోజుల తర్వాత అవసరం లేదు. ఆరుతడి లోనూ ప్రకృతి వ్యవసాయ విధానములో వరిసాగు చేయవచ్చు.
- మాగాణి భూములలో కూడా మొక్కల మధ్య మట్టి బాగా కలియ దున్నవచ్చు. ‘కోనో వీడర్’తో చేసే కంటే ఇది సులువు. రెండు ఎద్దులతో 8 గంటలలో రెండు ఎకరాలను చేయవచ్చు. నాట్లు వేసిన 20 రోజుల తర్వాత, 35 రోజుల తర్వాత, 50 రోజుల తర్వాత ఒకసారి రెండు ఇంచులలోపు మట్టి మాత్రమే బాగా కలియ తిప్పేటట్లు దున్నాలి. ఇలా చేయడంతో కలుపు నియంత్రణ జరుగుతుంది. ఒక మొక్కకు 80 నుంచి 120 వరకు పిలకలు వస్తాయి. కలుపు ఖర్చులు తగ్గుతాయి.
–మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి
Read Today's Latest Agriculture News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

