కాగజ్‌నగర్, ఆగస్టు 24 : సిర్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సిర్పూర్(టీ) మండలంలోని చింతకుంట గ్రామ సర్పంచ్ అజ్మీరా పుష్పలతతో పాటు సీనియర్ నాయకుడు మహేందర్ నాయక్, సిర్పూర్(టీ) మండలకేంద్రానికి చెందిన కొందరు యువకులు, చింతకుంట గ్రామ పంచాయతీకి చెందిన నాయకులు, యువకులు టీఆర్ఎస్లో బుధవారం చేరారు. వీరికి ఎమ్మెల్యే కోనప్ప టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ చేరుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. చింతకుంట గ్రామ పంచాయతీలో అంతర్గత రోడ్లు, చింతకుంట, హీరాపూర్ గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్(టీ) మండల కో-ఆప్షన్ సభ్యుడు కీజర్, నాయకులు పాల్గొన్నారు.
గౌడ కులస్తుల సంక్షేమానికి కృషి
కాగజ్‌నగర్‌టౌన్, ఆగస్టు 24: కల్లుగీత కార్మికులైన గౌడ కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సమీపంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 372వ జయంత్యుత్సవాల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని కొనియాడారు. నియోజకవర్గంలోని గీత కార్మికులకు సొంత ఖర్చులతో ఇన్సురెన్స్ చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్పను గౌడ సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కోండ్ర జగ్గాగౌడ్, రామాగౌడ్, సహకార సంఘం వైస్ చైర్మన్ తిరుపతిగౌడ్, ఎక్సైజ్ సీఐ విలాస్, మోకుదెబ్బ మహిళా నాయకురాలు నీరజగౌడ్, నవీన్, మురళీగౌడ్, ప్రకాశ్‌గౌడ్, నరేందర్‌గౌడ్, మనోహర్‌గౌడ్, దేవిగౌడ్, సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.