సోన్, ఏప్రిల్ 7 ః చికెన్ ధరలు రిటైల్ మార్కెట్లో ఆకాశన్నంటాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గింది. దీనికితోడు వరుస పండుగలు, పెండ్లిళ్లు, శుభకార్యాలు ఉండడం, మొక్కజొన్న, జొన్న, బియ్యం వంటి దాణా ఖర్చులు కూడా పెరగడం, డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగాయి. నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు సోన్, నిర్మల్ రూరల్ మండలాల్లోని రిటైల్ షాపుల్లో ఆదివారం చికెన్ ధర రూ.300 దాటింది. మూడు నెలల క్రితం రూ.140 ఉన్న ధర ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు చికెన్ కొనడానికి జంకుతున్నారు.