విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ | ర్షాల వల్ల అంటువ్యాధులు ప్రాబలే ప్రమాదం ఉన్నందున జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.

ఆదిలాబాద్ : వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రాబలే ప్రమాదం ఉన్నందున జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరం లో నిర్వహించిన గ్రామీణాభివృద్ధి సమీక్ష సమావేశం లో వివిధ శాఖల అధికారులు తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్ సూచించారు.
స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలలో దోమలు వ్యాపించకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. హరితహారం మొక్కలకు జియో ట్యాగ్గింగ్ తప్పనిసరి చేయాలన్నారు. ప్రకృతి వనాలలోని కలుపు మొక్కలు వర్షా కాలంలో రెండు సార్లు తప్పనిసరిగా తొలగించాలన్నారు.
కూలీలకు వెంటనే బిల్లులు చెల్లించాలని పంచాయతీ రాజ్ ఈఈని ఆదేశించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ సీఈఓ, డీఆర్డీవో ఇంచార్జి పీడీ సుధీర్, పంచాయతీ రాజ్ ఈఈ, శంకరయ్య, డీఈవో టీ ప్రణిత, వ్యవసాయ శాఖ ఏడీ బి వినయ్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

