Old Friends | మానవత్వం చాటుకున్న 2004 టెన్త్ బ్యాచ్.. చనిపోయిన స్నేహితుడి కుటుంబానికి ఆర్థికసాయం
Old Friends |చదువుకున్న రోజుల్లో ఏర్పడిన స్నేహబంధాన్ని మరువకుండా, మృతి చెందిన సహచరుడి కుటుంబానికి 2004 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం కస్రా గ్రామానికి చెందిన మంగలి సంజీవ్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు.
Old Friends |కుభీర్, అక్టోబర్ 25: చదువుకున్న రోజుల్లో ఏర్పడిన స్నేహబంధాన్ని మరువకుండా, మృతి చెందిన సహచరుడి కుటుంబానికి 2004 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం కస్రా గ్రామానికి చెందిన మంగలి సంజీవ్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు.
ఆదివారం కస్రా గ్రామానికి వెళ్లిన పూర్వ విద్యార్థులు సంజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.25 వేల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాన్ని అందించారు. సంజీవ్ కుమార్తె భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఆమె పేరు మీద సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఖాతా తెరిచి, పాస్‌బుక్‌ను అందజేశారు. కుటుంబానికి అవసరమైన నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేశారు.
కలిసి చదువుకున్న సహచరుడి కుటుంబం కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ సహాయం అందించినట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. సంజీవ్ మృతి ఆ కుటుంబానికి తీరని లోటని, ఈ ఆర్థిక సాయం వారికి కొంత ఊరటనిస్తుందని పేర్కొన్నారు. స్నేహబంధాన్ని నిలబెట్టుకుంటూ ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం అభినందనీయమని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కుభీర్‌కు చెందిన డాక్టర్ దత్తు సింగ్, ఏ. జీవన్, ఎర్రోళ్ల సతీష్, అనిల్, సాయినాథ్, బాలాజీ, లక్ష్మణ్, హనుమాన్లు, సునీల్, రవీందర్, తిరుపతి తదితర 2004 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

