అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి..
ఎన్నికలప్పుడు మాత్రం వచ్చే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులను నిలదీసి అభివృద్ధికి ఓటు వేయాలని నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.
- రైతు బంధు, ఆసరా పింఛన్ కావాలంటే కారుకు ఓటు వేయండి
- ఎన్నికలప్పుడు వచ్చే నాయకులను నిలదీయండి
- ఎన్నికల ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
దిలావర్పూర్, నవంబర్ 8 : ఎన్నికలప్పుడు మాత్రం వచ్చే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులను నిలదీసి అభివృద్ధికి ఓటు వేయాలని నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని కాల్వ, కాల్వతండా, సిర్గాపూర్, మాయాపూర్, ఓడ్డెపల్లి, కంజర్, బన్సపల్లి, సాంగ్వీ గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించే నాయకుడిని గుర్తించుకోవాలని ఎన్నికలు రాగానే ఆగం కావద్దని అన్నారు.
బీజేపీకి ఓటు వేస్తే ఇప్పుడున్న గ్యాస్ సిలిండర్ ధర రూ. 2400 చేస్తుందని, కారు గుర్తుకు ఓటు వేస్తే సిలిండర్‌ను రూ.400 ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇప్పుడున్న 24 గంటల ఉచిత విద్యుత్ తీసి వేసి 3 గంటల కరెంట్ ఇచ్చే పార్టీ కావాల్లో రైతులు ఆలోచించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే రైతు బంధుకు రామ్రామ్ పలుకుతారని, రాష్ర్టాన్ని రాబందులా పీక్కుతింటారని అన్నారు. అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేసే నాయకుడిని గుర్తించాలని కోరారు.

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాన్ని గెలిపిస్తే వచ్చే మార్చి నుంచి ఆసరా పింఛన్‌ను పెంచుతామని,అర్హులైన వారందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఆడెపు తిరుమల, గంగారెడ్డి, శ్రీనివాస్, రొడ్డ మహేశ్, బన్సపల్లి సహకార సంఘం చైర్మన్ పీవీ రమణరెడ్డి, జిల్లా పరిషత్ కోఅప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్‌రావు, బీఆర్ఎస్ నాయకులు పాల్దే శ్రీనివాస్, పూజారం మహేశ్, చిన్నయ్య, సాయన్న, శ్యామ్‌సుందర్‌రెడ్డి, సక్కారాం, తదితరులు పాల్గొన్నారు.
కాల్వలో బీజేపీకి బిగ్‌షాక్
దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలో బీజేపీ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో బీజేపీ నాయకులు హర్షిత్(డింపు) తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. అంతకుముందు మంత్రికి మోటరు సైకిల్ ర్యాలీతో స్వాగతం పలికారు. బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన 50 మంది యువకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వెంటనే ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆడెపు శ్రీనివాస్, పాల్దే అపిల్, చిన్నయ్య, శ్రీనివాస్, మహేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

