సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ సతీశ్‌కుమార్

చెన్నూర్ : ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా పలువురికి మంజూరైన చెక్కులను ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ చెన్నూర్‌లో సోమవారం పంపిణీ చేశారు. చెన్నూర్ పట్టణానికి చెందిన జి. సునీతకు రూ. 60,000, చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామానికి చెందిన సంతోష్‌కు రూ 30,000, నెన్నెల మండలం కుష్నపల్లి గ్రామానికి చెందిన స్వప్నకు రూ 16,000, కోటపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సమ్మయ్యకు రూ. 28,000 మంజూరు కాగా వాటి చెక్కులను ఎమ్మెల్సీ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మోతె తిరుపతి, కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, జగన్నాథుల శ్రీను, దోమకొండ అనీల్, జోడు శంకర్, కో-ఆప్షన్ సభ్యులు కేవీఎం శ్రీనివాస్, అయూబ్, మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు రాంలాల్ గిల్డా, వేముల మహేందర్, మేడ సురేశ్‌రెడ్డి, నాయిని సతీశ్, కొండపర్తి వెంకటరాజం, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | గోల్డెన్ గ్లామర్‌లో జాన్వీ కపూర్.. కుర్రాళ్లను కట్టిపడేస్తున్న ఫొటోలు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్
Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
Prasidh Krishna: కివీస్‌తో వన్డేలకు ప్రసిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జట్టులోకి సిరాజ్
Mirzapur: The Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

