Insurance | మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం
Insurance | మృతి చెందిన రైతు కుటుంబానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రూ.2 లక్షల బీమా ఆర్థిక సాయం అందజేశారు.
కుభీర్ : మృతి చెందిన రైతు కుటుంబానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రూ.2 లక్షల బీమా ( Insurance ) ఆర్థిక సాయం అందజేశారు ఇటీవల బందర్వర్ సంతోష్ అనే రైతు మృతి చెందడంతో ఆయన భార్య ముత్తుభాయికి రూ.2 లక్షల బీమా చెక్కును ఆ సంఘం చైర్మన్ రేకుల గంగాచరణ్, సంఘం కార్యదర్శి ఎగ్గం క్రాంతి కుమార్ అందజేశారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వ్యవసాయ రుణం తీసుకునే సమయంలో రైతులకు బీమా సదుపాయం కల్పిస్తారని అన్నారు. బీమా నిబంధనలకు అనుగుణంగా 58 సంవత్సరాల లోపు రైతు మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం అందజే స్తామన్నారు.
సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్న రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చొండి మాజీ సర్పంచ్ జే. చంద్రకాంత్, సిబ్బంది ఆకుల వెంకటరమణ, గణేష్, శివరామ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
‘ప్రభుత్వానికి పట్టభద్రులు బుద్ధి చెప్పాలి’
Rajkumar Periyasamy | అది సీక్వెల్ కాదు, అక్కడితోనే క్లోజ్.. ధనుష్ ‘ఓం’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
Srinivas Goud | రైతాంగానికి ఎకరాకు రూ. 25 వేల నష్టపరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KTR | పబ్లిక్ గొంతు నొక్కడం ఏ రకమైన పబ్లిక్ హియరింగ్ అవుతుంది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

