చిన్న వయసులోనే గుండెపోట్లు
ఉరుకుల పరుగుల జీవనం.. ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వారు ఉద్యోగ.. వ్యక్తిగత సమస్యలతో సతమతం అవుతున్నారు. ఒత్తిడిలో పని చేస్తూ బీపీలు, షుగర్లు, కిడ్నీ సంబంధిత వ్యాధులు తెచ్చుకుంటున్నారు. దీర్ఘకాలంలో అవి గుండెపోటుకు దారి తీస్తున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే గుండెపోటుతో మృత్యువాత పడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం.
- జిల్లాలో వరుసగా నమోదవుతున్న ఘటనలు
- కొవిడ్ అనంతరం మారిన జీవనశైలి, అలవాట్లే కారణం
- చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ముప్పు నుంచి తప్పించుకోవచ్చు..
- శారీరక శ్రమ, వ్యాయామం లాంటివి చేస్తే మేలు
.. ఇలా డ్యాన్స్ చేస్తూ.. నిద్రలోంచి లేస్తూ.. కూర్చున్నవారు కూర్చున్నట్లే కుప్పకూలుతున్నారు. ఏమైందో తెలిసేలోపే తుదిశ్వాస వదులుతున్నారు. అప్పటివరకు మనతో కలిసిమెలిసి ఉండి.. నవ్వుతూ మాట్లాడి.. ఆహ్లాదంగా గడిపిన ఆత్మీయులే హఠాన్మరణం పొందడం విషాదకరం. ఇందులో యువత నుంచి నడివయసు వారి వరకు ఉండడం విచారకరం. వయసుతో సంబంధం లేకుండా మృత్యుఒడికి చేరుతుండడం ఆలోచించాల్సిన విషయం. ప్రధానంగా కాలంతో పరుగెత్తడం, వ్యక్తిగత సమస్యలు, కరోనా తర్వాత మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, వర్క్ ఫ్రం హోమ్స్ పెరగడం వంటివి హృదయం ఆగేలా చేస్తున్నాయి. చాలా కుటుంబాలను విషాదం లోకి నెట్టి వేస్తూ.. ఆప్తులకు కన్నీరు మిగుల్చుతు న్నాయి. ఈ క్రమంలో జాగ్రత్తలు, అలవాట్లను మార్చుకుంటే గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
మంచిర్యాల, మార్చి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉరుకుల పరుగుల జీవనం.. ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వారు ఉద్యోగ.. వ్యక్తిగత సమస్యలతో సతమతం అవుతున్నారు. ఒత్తిడిలో పని చేస్తూ బీపీలు, షుగర్లు, కిడ్నీ సంబంధిత వ్యాధులు తెచ్చుకుంటున్నారు. దీర్ఘకాలంలో అవి గుండెపోటుకు దారి తీస్తున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే గుండెపోటుతో మృత్యువాత పడుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన కొన్ని నెలలుగా ఈ తరహా ఘటనలు ఎక్కువైపోతున్నాయి. మృతి చెందుతున్న వారిలో 17 సంవత్సరాలు మొదలు 50 సంవత్సరాలలోపు వారే అధికంగా ఉంటున్నారు. డాన్స్‌లు చేస్తూ.. ఏదైనా పని చేస్తూ… ఉన్నట్టుండి అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్న వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. దీంతో చాలా మందిలో భయం మొదలైంది. చాతిలో గ్యాస్ ప్రాబ్లమ్‌తో నొప్పి లేసినా, మంట లేసినా వెంటనే ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కరోనా అనంతరం మారిన జీవన శైలి.. మానసిక ఒత్తిడి.. శారీరక శ్రమ తగ్గిపోవడం.. వర్క్ ఫ్రమ్ హోం పెరగడం.. జంక్‌ఫుడ్స్‌కు అలవాటుపడడం ఇవన్నీ గుండెను ఇబ్బంది పెడుతున్నాయి. గాడి తప్పిన ఆహారపు అలవాట్లలో వచ్చే ఊబకాయ సమస్య, మధుమేహం, బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలకు దారి తీస్తున్నాయి. చివరకు అవి గుండెపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ, మంచి అలవాట్లను అలవర్చుకుంటే గుండెపోటు అనే పెద్ద ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
సంకేతాలు..
- గుండెపోటు వచ్చే ముందు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది.
- గుండె నొప్పి రావడానికి ముందు శ్వాసతీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది.
- రక్తం సరఫరా తగ్గి గుండెలో మంటగా ఉంటుంది.
- గుండె భారంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది.
- మత్తుగా ఉండి, చెమటలు ఎక్కువగా పడుతాయి.
- తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు వస్తున్నా అశ్రద్ధ చేయొద్దు.
- వికారం, ఆహారం జీర్ణం కాకపోవడం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు గుండెపోటుకు దారితీస్తాయి.
- శరీర పైభాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే గుండెనొప్పి వచ్చేందుకు అది సంకేతంగా గుర్తించాలి.
ముఖ్య కారణాలు..
- కొవిడ్ తర్వాత జీవనశైలిలో మార్పులు వచ్చాయి. ప్రొటీన్లు అధికంగా ఉండే మటన్, చికెన్ తినాలనే అపోహ పెరిగింది. ఆ టైమ్‌లో వాస్తవానికి తినడం కూడా మంచిది అయ్యింది. అప్పటి నుంచి ఆ హాబిట్ పెరిగింది. ఒకప్పుడు చుట్టాలు ఇంటికొస్తేనో, పండుగకో నాన్‌వెజ్ తినేవాళ్లు. కొందరు నెలకు ఒకసారి అని తినేవారు. కానీ.. ఇప్పుడు వారంలో రెండు సార్లు మాంసాహారం తీసుకుంటున్నారు. తాత్కాలికంగా అవి బాగానే అనిపించినా దీర్ఘకాలంలో గుండెపై ప్రభావం చూపుతున్నాయి.
- ఫుడ్ దొరకడం పెరిగింది. స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ మూడో తరగతి నగరాలకు విస్తరించాయి. కాస్మోపాలిటన్, మెట్రోపాలిటన్, మున్సిపల్ కార్పొరేషన్స్తోపాటు మున్సిపాలిటీలకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వచ్చేసింది. దీంతో ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడంతో దూరాన్ని బట్టి అర గంటలోనే కష్టం లేకుండా ఇంటికి వచ్చేస్తుండడంతో నాన్‌వెజ్ వినియోగం భారీగా పెరిగింది.
- కరోనా తరువాత డిస్పోజబుల్ కాన్సెప్ట్ పెరిగింది. ఓవర్ హైజిన్ పేరిట ఒకరు వాడింది మరొకరు వాడకూడదని చాలా మంది అనుకుంటున్నారు. అలా మనం వాడే డిస్పోజబుల్ వస్తువులు టీ కప్పులు, స్ట్రాంగ్ పేపర్ కప్పులు, ప్లేట్స్, ప్లాస్టిక్ కప్పుల్లో చాలా రకాల కెమికల్స్ ఉంటున్నాయి. వాటిలో ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది. అంతిమంగా ఆ ప్రభావం హృదయంపై పడుతున్నది.
- కరోనా వ్యాక్సిన్లు గుండెపోటుకు కారణం అనడం కంటే.. కరోనా వైరస్ ప్రభావం ఇంకా ఉండి ఉండొచ్చు. కరోనా వచ్చి చనిపోయిన వారిలో అధిక మంది రక్తం గడ్డకట్టి చనిపోయారు. పల్మోనిత్రయంబాలిజం అంటే గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు మూసుకుకోవడం. కరోనా వైరస్ ఆ రక్తనాళాల మీదే ఎక్కువ ప్రభావం చూపింది. ఆ సమయంలో రక్తం గడ్డ కట్టకుండా ఇంజక్షన్లు కూడా ఇచ్చారు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పడుతున్నట్లయితే అది కూడా గుండెపోటుకు దారి తీస్తున్నట్లే. కానీ.. ఈ విషయం మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.
- వాకింగ్లు, వ్యాయామాలు చేయడం తగ్గింది. చాలా మంది ఇంట్లో వరకే పరిమితం అయ్యారు. వర్క్ అవుట్ చేయడం తగ్గింది. వర్క్ ఫ్రమ్ హోం పెరిగింది. కూర్చొని చేసే పనులు హాయి అనుకుంటున్నారు. గుండె జబ్బులకు ఇది కూడా కారణం అవుతున్నది.
ఇలా గుర్తించవచ్చు..
- శరీర పైభాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే.. గుండెనొప్పి వచ్చేందుకు అది సంకేతంగా భావించాలి.
- శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నా, గుండెలో మంటగా ఉన్నా, చెమటలు పట్టినా, తీవ్ర అలసటగా ఉన్నా వైద్యులను సంప్రదించాలి.
వీటికి దూరంగా ఉందాం.. గుండెకు భారం తగ్గిద్దాం..
- రోజూ పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి. ఫాస్ట్ఫుడ్స్, ఎగ్పప్స్, సమోసా, మిర్చీ, పానీపూరి లాంటి చిరుతిండ్లు మానేయాలి. వాటి స్థానంలో పండ్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. శీతల పానియాలను తగ్గించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మోతాదుకు మించి తీసుకోకుండా చూసుకోవాలి.
- కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. చికెన్, మటన్ కంటే గుడ్లు, చేపలు, లీన్కట్స్ మొదలైనవి తీసుకోవడం మేలు. చికెన్, మటన్ నెలలో ఒక్కసారి లేదా రెండుసార్లు తీసుకుంటే సరిపోతుంది.
- రోజూ తీసుకునే ఆహారంలో ఉప్పు ఆరు గ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి.
- శారీరక శ్రమ, వ్యాయామం మొదలైనవి చేయాలి. ఇలా చేస్తే ఉబకాయం, మధుమేహం, రక్తపోటు స్థాయిని నియంత్రించుకోవచ్చు. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఇదే సరైన మార్గం.
- రోజూ 30 నుంచి 45 నిమిషాల వరకు మితమైన, తీవ్రమైన శారీరక శ్రమ చేయాలి. వారంలో కనీసం ఐదు రోజులైనా ఇలా చేయాలి. l స్మోకింగ్ అలవాటు ఉన్నవారు మానేయాలి. ధూమపానం మానేసిన 24 గంటల్లోపు గుండె జబ్బు వచ్చే ప్రభావం తగ్గుతుంది.
- డిస్పోజబుల్ గ్లాస్లు, ప్లేట్స్ వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఇది చేస్తే ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి బయటపడినట్లే.
క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరం..
ధూమ, మద్యపానం, అధిక మాంసం వినియోగం మంచిది కాదు. గుండెకు ఇవి తీవ్రమైన హాని చేస్తాయి. వ్యాయాయం, యోగా, మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. యువతకు హార్ట్ అటాక్ వస్తుంది అంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి లేకపోవడమే ప్రధాన కారణం. ఆయాసం, గుండెనొప్పి, ఎక్కువ చెమట పట్టడం, కళ్లు తిరగడం మొదలైన లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్ కుమార్, ప్రముఖ చాతి వైద్య నిపుణులు
ఆహారపు అలవాట్లు.. శారీరక శ్రమ ముఖ్యం..
అధికంగా చెక్కర, ఉప్పు, కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవడంతో రక్త సరఫరా చేసే రక్తనా ళాలు మూసుకుపోతా యి. ఆ సమయంలో గుండెకు ఆక్సిజన్ అందక గుండెపోటు వస్తుంది. ప్రస్తుత బిజీ లైఫ్‌లో దొరికిన ఆహారాన్ని తినేస్తు న్నారు. ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటుపడుతున్నారు. ఆహార నియమాలను పూర్తిగామరిచిపోతున్నారు. దీనికి మానసిక ఒత్తిడి కూడా తోడవుతుంది. శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు గుండె జబ్బులకు కారణం అవుతున్నాయి.
– డాక్టర్ కార్తీక్, ప్రముఖ గుండె వైద్య నిపుణులు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో ఓ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ ముత్యం(19) ఒక్కసారిగా కుప్పకూలాడు. మొదట అందరూ డ్యాన్స్‌లో భాగంగా అలా చేశాడేమో అనుకున్నారు. పైకి లేవకపో వడంతో అప్రమత్తమైన అక్కడి వారు ఛాతిపై పంపింగ్ చేశారు. ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంతో వెంటనే భైంసా ఏరియా దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. బంధువు పెండ్లికి వచ్చి మృతిచెందిన ఈ యువకుడి స్వస్థలం మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకా శివుని గ్రామం.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల(బీ) గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వంగ లాల్‌రెడ్డి(48) ఈనెల 5న ఉదయం లేవగానే చాతిలో నొప్పి లేస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వెంటనే కారులో దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. గుండెపోటుతోనే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామానికి చెందిన మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిలుకూరి విజేందర్(49) కూడా గత బుధవారం హఠాన్మరణం చెందాడు.
సీపీఆర్‌తో కాపాడుకోవచ్చు..
ఎవరైనా చాతిలో నొప్పి, ఇబ్బందితో కుప్పకూలితే పక్కన ఉన్నవారు వెంటనే రెండు చేతులతో చాతిపై బలంగా నొక్కాలి. ఇలా 30 నుంచి 40 సార్లు పంపింగ్ చేశాక రెండు ముక్కు రంధ్రాలు మూసి నోటిలోకి గాలిని గట్టిగా ఊదాలి. ఇలా రెండు, మూడు సార్లు చేయాలి. ఇలా చేయడాన్ని సీపీఆర్(కార్డియో పల్మనరీ రిససిటేషన్) అంటారు. ఇప్పటికే దీనిపై అవగాహన కల్పించే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

