హాజీపూర్ : మంచిర్యాల ( Mancherial ) కార్పొరేషన్ పరిధిలోని 16 వ వార్డు ముల్కల్లలో ఆదివారం గంగాదేవి బోనాల ( Gangadevi Bonalu ) జాతర భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. గ్రామ మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో తలపై బోనాలు మోసుకుంటూ ఊరేగింపులో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
డప్పు వాయిద్యాలు, భక్తి గీతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఊరేగింపును మరింత ఆకర్షణీయంగా మార్చారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేశారు.
అమ్మవారి కృపతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలు ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.