ఆసిఫాబాద్,మార్చి2 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా వెంకటేశ్ దౌత్రేను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
హేమంత్ బోర్కడే సహదేవరావును హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బదిలీ చేయగా, ఆయన స్థానంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న స్నేహ శబరీష్‌ను జిల్లా కలెక్టర్‌గా కేటాయించింది.
ఉత్తర్వులు వెలువడి నాలుగు రోజులైనా స్నేహ బాధ్యతలు స్వీకరించకపోవడంతో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్‌ను కలెక్టర్‌గా ఇక్కడికి బదిలీ చేశారు.