అకాల వర్షం.. అపార నష్టం
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలకు భారీ నష్టాన్ని చేకూర్చుతున్నాయి. మంగళవారం కురిసిన వడగళ్ల వానతో రైతుల చేతికొచ్చిన జొన్న, మక్క, నువ్వులు, పల్లి, వరి పంటలను నష్టపోవాల్సి వచ్చింది. వర్షాలతో నష్టపోయిన పంటలను బుధవారం వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తలమడుగు, తాంసి, నేరడిగొండ, భీంపూర్, మావల, నార్నూర్, సిరికొండ, ఇచ్చోడ, ఉట్నూర్ మండలాల్లో రెండు వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
- వడగళ్ల వానతో పంటలు కోల్పోయిన రైతులు
- పరిశీలించిన వ్యవసాయశాఖ అధికారులు
- రెండు వేల ఎకరాల్లో నష్టం జరిగినట్లు అంచనా
ఆదిలాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలకు భారీ నష్టాన్ని చేకూర్చుతున్నాయి. మంగళవారం కురిసిన వడగళ్ల వానతో రైతుల చేతికొచ్చిన జొన్న, మక్క, నువ్వులు, పల్లి, వరి పంటలను నష్టపోవాల్సి వచ్చింది. వర్షాలతో నష్టపోయిన పంటలను బుధవారం వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తలమడుగు, తాంసి, నేరడిగొండ, భీంపూర్, మావల, నార్నూర్, సిరికొండ, ఇచ్చోడ, ఉట్నూర్ మండలాల్లో రెండు వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బోథ్, నేరడిగొండ మండలాల్లో 1,002 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం మంజూరు చేసింది. తాజాగా కురిసిన అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం నివేదికలను ప్రభుత్వానికి పంపించనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య తెలిపారు.
పల్లి పంటను నష్టపోయా..
నేను రెండెకరాల్లో పల్లి వేశా. సాగులో భాగంగా రూ.40 వేల పెట్టుబడి పెట్టా. వంద రోజుల్లో దిగుబడులు వస్తాయి. ప్రస్తుతం కోత దశలో ఉండగా.. దిగుబడిపై ఆశలు పెట్టుకున్నా. ఎకరాకు ఏడు క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉండగా.. మంగళవారం కురిసిన వడగళ్లవానతో నష్టం జరిగింది. వర్షం కారణంగా దిగుబడిలో 50 శాతం నష్టపోవాల్సి వచ్చింది. క్వింటాలుకు రూ.5 వేల ధర పలుకుతుంది.
– సంపతి రవికాంత్, రైతు, దేవాపూర్, తలమడుగు మండలం
ఐదెకరాల్లో సగం పంట నష్టపోయా..
మాకు ఐదెకరాల భూమి ఉండగా మూడెకరాల్లో జొన్న, రెండెకరాల్లో పల్లి వేశా. సాగులో అధికారుల సూచనలు పాటించడంతోపాటు జాగ్రత్తలు తీసుకున్నా. దీంతో జొన్న, పల్లి దిగుబడి బాగా వచ్చాయి. పంటలు తీసేందుకు సిద్ధమవుతుండగా రాళ్లవానతో నష్టపోవాల్సి వచ్చింది. జొన్న కంకులు నేల రాలిపోగా, పత్తి పంటలో నీరు నిలువడంతో కాయలు నల్లబడుతున్నాయి. ఐదెకరాల్లో సగం పంట చేతికి రాని పరిస్థితి నెలకొంది.
– నాయిని ప్రవీణ్, రైతు, దేవాపూర్, తలమడుగు మండలం
పంట నష్టం నివేదిక ప్రభుత్వానికి పంపిస్తాం..
ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం కురిసిన వడగళ్ల వానతో తొమ్మిది మండలాల్లోని 2 వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్లు గుర్తించాం. జొన్న, మక్క పల్లి, నువ్వు, వరి పంటలను రైతులు నష్టపోవాల్సి వచ్చింది. వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం నివేదికలు తయారు చేశాం. జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి అందజేస్తాం.
– పుల్లయ్య, జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

