ప్రభుత్వ దవాఖానలో ఎక్స్పైరీ మందులు!
కాలం చెల్లిన మందులు ఇవ్వడంతో గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురైందని ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వైద్య సిబ్బందిని బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం నిలదీశారు. గర్భిణి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గర్భిణి ఇటీవల బజార్హత్నూర్లోని ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకున్నది. ఫోలిక్ యాసిడ్ మాత్రలను సిబ్బంది అందించారు.
- వాడిన కొద్ది సేపటికే గర్భిణికి తీవ్ర అస్వస్థత
- వైద్య సిబ్బందిపై కుటుంబ సభ్యుల ఆగ్రహం
బజార్హత్నూర్, జూలై 10 : కాలం చెల్లిన మందులు ఇవ్వడంతో గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురైందని ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వైద్య సిబ్బందిని బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం నిలదీశారు. గర్భిణి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గర్భిణి ఇటీవల బజార్హత్నూర్లోని ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకున్నది. ఫోలిక్ యాసిడ్ మాత్రలను సిబ్బంది అందించారు. రెండు రోజుల క్రితం ఆ మందులు వాడింది.
కొద్దిసేపటికే గర్భిణికి తీవ్ర రక్తస్రావమైంది. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖాన తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై శుక్రవారం దవాఖానకు వచ్చి ఆరోగ్య సిబ్బందిని నిలదీశారు. గతేడాది జూలై నెలలో గడువు ముగిసినప్పటికీ చూడకుండా మందులు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మాత్రలు ఈ దవాఖానలో ఇచ్చినవి కావని వైద్య సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై డీఎంహెచ్‌వో సాధనను వివరణ కోరగా ప్రభుత్వ దవాఖానలో ఎక్స్పైరీ అయిన మాత్రలు ఎలా పంపిణీ జరిగాయనే విషయంపై పూర్తి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Premada Oorali | రూ.2 కోట్ల బడ్జెట్‌తో సినిమా,బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల వసూళ్లు.. ‘ప్రేమద ఊరాలి’ సంచలనం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

