వడ్లు, మక్కల కొనుగోళ్లు పూర్తి
నిర్మల్ జిల్లాలో వరిధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. పంటల కొనుగోళ్లపై శుక్రవారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
- వారం రోజుల్లో జొన్నల కొనుగోళ్లు పూర్తి చేస్తాం
- నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్, జూన్ 12(నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలో వరిధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. పంటల కొనుగోళ్లపై శుక్రవారం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాలను మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 20,977మంది రైతుల నుంచి దాదాపు 1.58లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను కొని గోదాములకు తరలించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి రూ.380 కోట్లకు గాను ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూ.133 కోట్లు విడుదల కాగా, రైతుల ఖాతాల్లో రూ.100 కోట్ల వరకు జమ చేశామన్నారు. త్వరలోనే మిగతా రైతులకు కూడా డబ్బులు జమవుతాయన్నారు. శుక్రవారం నాటికి జిల్లా వ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయన్నారు. ఇప్పటి వరకు మొత్తం 258 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.75లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఖానాపూర్ మండలం బాదన్‌కుర్తిలో ఒకటి, సారంగాపూర్ మండలం యాకర్పెల్లిలో మరొకటి మాత్రమే సెంటర్లున్నాయని, రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు.
వారంలో జొన్నల కొనుగోళ్లు పూర్తి…
యాసంగిలో 44వేల ఎకరాల్లో రైతులు జొన్న పంటను సాగు చేయగా 14 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 30వేల మెట్రిక్ టన్నుల జొన్నలు రాగా, 20వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు. మూడు ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, జొన్నలను ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన జిల్లాలు రాష్ట్రంలో కేవలం రెండు, మూడు మాత్రమే ఉన్నాయని, అందులో మన నిర్మల్ జిల్లా కూడా ఉందన్నారు. సమర్థవంతంగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేసిన ఆయా శాఖల అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
ఎరువుల కొరత లేకుండా చూస్తాం
ఈ వానకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు ఎరువుల కొరత రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 10,734 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలని సూచించారు. అధిక ధరలు వసూలు చేస్తే, 8977751754 నంబర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలన్నారు. ఇప్పటికే అధిక ధరలకు ఎరువులు విక్రయించిన పలు దుకాణాదారులకు నోటీసులిచ్చినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఈ నెల 26 నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ప్రజలకు మీడియా వేదికగా అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్డీవో విజయలక్ష్మి, మార్క్‌ఫెడ్ డీఎం మహేశ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి బీవీ.రమణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

