సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
సైబర్ నేరాలపై విద్యార్థినులు అవగాహన పెంచుకోవాలని, ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటీంలకు సమాచారం అందించాలని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే కుమారస్వామి సూచించారు. సైబర్ నేరాలు, షీటీంలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం తాండూర్ కేజీబీవీలో విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
- తాండూర్ సీఐ కే కుమారస్వామి
- సైబర్ నేరాలపై అవగాహన
తాండూర్, జూన్ 22 : సైబర్ నేరాలపై విద్యార్థినులు అవగాహన పెంచుకోవాలని, ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటీంలకు సమాచారం అందించాలని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే కుమారస్వామి సూచించారు. సైబర్ నేరాలు, షీటీంలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం తాండూర్ కేజీబీవీలో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని సూచించారు.
మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం షీ టీం ఏర్పాటు చేశామని, ఏదైనా ఆపదలో ఉంటే 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మోసాలకు గురైతే 1930 నంబర్‌కు డయల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది రామానంద్, లక్ష్మణ్, శ్రీనివాస్, కేజీబీవీ ఇన్చార్జి ఎస్వో సుమన చైతన్య, ఉపాధ్యాయులు కళావతి, మనీషా, సంధ్యారాణి, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
శ్రీరాంపూర్, జూన్ 22 : మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై షీ టీమ్స్ శనివారం శ్రీరాంపూర్ కేరళా మోడల్ హైస్కూల్లో విద్యార్థులకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఐ సంతోష్ పాల్గొని మాట్లాడారు. షీ టీమ్‌లపై రక్షణ, సైన్స్ ఆఫ్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్, 100 డయల్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు మల్లయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.
కాసిపేట, జూన్ 22 : ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని కాసిపేట ఏఎస్ఐ బూర రవీందర్ సూచించారు. శనివారం కాసిపేటలో సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు, క్రెడిట్ కార్డ్స్ సంబంధిత మోసాలు, ఇన్వెస్ట్మెంట్ మోసాలు, అడ్వరె్టైజ్మెంట్ ఫ్రాడ్స్, లోన్‌యాప్ లు, ఓటీపీ, సైబర్ క్రైమ్ పోర్టల్, సైబర్ ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930పై వివరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు రాజేందర్, రాజు, రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
కన్నెపల్లి, జూన్ 22 : సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నెపల్లి ఎస్ఐ గంగారాం సూచించారు. కన్నెపల్లి మండలంలోని జజ్జరవెల్లిలోని ప్రజలకు అవగాహన కల్పించారు.
చెన్నూర్ టౌన్, జూన్ 22 : చెన్నూర్ పోలీస్ ఆధ్వర్యంలో ఉమెన్ సేఫ్టీ, సైబర్ మోసాలు, ఆత్మవిశ్వాసం, ట్రాఫిక్ రూల్స్, చైతన్యపరిచేందుకు విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నమున్షి హైస్కూల్ విద్యార్థులకు ఎస్ఐ శ్వేత ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్టవేయడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడం, తదితర అంశాలపై వివరించారు. పట్టుదలతో కష్టపడి ఉద్యోగాలు సంపాదించాలని సూచించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

